Padigapulo

Padigapulo

Singers: Shanmukha Bharadwaj

Lyricist: Priyesh Mothukuri

Music by: Prabath

Duration: 03:15 Min

Download: 0+

Padigapulo is a song that has been liked by many people. The song is from the album Telugu Songs which released in 2026. Shanmukha Bharadwaj sang this song and Prabath made the music. The lyrics are by Priyesh Mothukuri.

Padigapulo Song Download

Padigapulo Song Lyrics In English Dear Kavya




గుండెల్లో ఈ సందళ్ళు

వచ్చాయే నీ వల్లేను

కన్నుల్లో ఈ వెన్నెల్లు

తెచ్చిందే నీ నవ్వేను


ఏదో ఊసే చెప్పాలన్న

కల్లోలాలే రాబోతున్న

మైకం దాటి వింటుందా హృదయం

ఇలా నాతో నువుంటున్న

క్షణం ఎంతో బాగుందంటు

తనే ఆగి చూస్తుందా సమయం


పడిగాపులో తలదాచుతూ

గడిచాయిలే ఇన్నిరోజులు

ఒక క్షణమునే ఒక యుగములా ప్రేమా

చెలి రాకతో చెలి మాటతో

మురిసాయిలే చిరునవ్వుల

ఎద తేలడం తొలిసారి చూసున్నా ఆ ఆ ఆ


నిను చూసిలా, నా మనసిలా

తెగ పెంచుకున్నా ప్రేమని

ఈనాడిలా ఈ చెలిమిలో

తను పంచుతుందా సగమనీ


ఇన్నాళ్ళ దూరం చేరిందా తీరం

నాకున్న భారం తీరింది తరుణం

నానుంచి నిన్ను నీనుంచి నన్ను

ఈవేళ ఎవరూ విడదీయలేదు

నాదన్న ప్రాణం నీదంటూ తెలుసుకొనీ


ఎన్నో ఎన్నో అందామన్న

చాలే నా ఈ భాషే చిన్న

సడే నీతో పలికితే దయనం

కన్ను కన్ను కలిసేవేళ

మాయం కావా నింగీ నేల

ఇలా ఉంటె నువ్వు కలకాలం


పడిగాపులో తలదాచుతూ

గడిచాయిలే ఇన్నిరోజులు

ఒక క్షణమునే ఒక యుగములా ప్రేమా

చెలి రాకతో చెలి మాటతో

మురిసాయిలే చిరునవ్వుల

ఎద తేలడం తొలిసారి చూసున్నా ఆ ఆ ఆ

Leave a Comment
User Comments

No comments yet.